- Advertisement -
తెలంగాణ గవర్నర్ ను కలిసిన దుర్గ
హైదరాబాద్ డిసెంబర్ 22
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను టీటీడీ ఎస్వీబీసీ అడ్వైజర్ అడపా దుర్గ హైదరాబాద్ రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు . కాట్రేనికోన మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం కుండలేశ్వరస్వామి ఆలయ విశిష్టత , వైభవాన్ని వివరించి స్వామి వారి చరిత్ర పుస్తకాలను అందజేసారు . ఇటువంటి గొప్ప క్షేత్రాన్ని తాను సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకుంటానని గవర్నర్ అన్నారు . ఈ సందర్భంగా
ఎస్వీబీసీ ప్రచురించిన సంపూర్ణ సుందరాకాండ పారాయణం పుస్తకాలను , తిరుమల శ్రీవారి 2024 క్యాలెండర్లు, డైరీలను గవర్నర్ కు దుర్గ అందజేసారు
- Advertisement -



