ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీలు

- Advertisement -

ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీలు

—-క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం
కర్రి భాస్కర్

తాడేపల్లిగూడెం

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ గ్రౌండ్లో 12వార్డు సచివాలయం తరుపున రెండు టీంలు తో క్రీకెట్ పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు పాల్గొన్నారు,  క్రికెట్ గ్రౌండ్ ని ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో కూడా ఇలాంటి క్రీడలు నిర్వహించడంలేదని, మన రాష్ట్రంలోనే సుమారు 150కోట్లు పెట్టి నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. మట్టిలో మాణిక్యాలని వెలుగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం అని తెలిపారు. క్రికెట్ టీం కి అంబటి రాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా, షటిల్ కు పీవీ సింధు బ్రాండ్ అంబాసిడర్ అని,అలాగే మిగిలిన ఆటలకు కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు అంబాసిడర్ లాగా నియమించి జాతీయస్థాయిలో ఆటలను ఆడేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఆయన తెలిపారు, ఈ ఆటలు 47 రోజులు జరుగుతాయని సచివాలయం స్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి క్రీడాకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున మంచి ప్రోత్సాహకాలు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు, రాష్ట్రస్థాయిలో గెలిచిన క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఆడేలాగా మరింత ప్రోత్సహించేలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని తెలిపారు, వార్డ్ ఇంచార్జ్ చామన సూర్యచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రీడలను క్రీడాకారులను గుర్తించేందుకు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి అరిమిల్లి రవి, కోడే శ్రీను, సచివాలయ సిబ్బంది అడ్మిన్ మహమ్మద్ రూబియా, వెల్ఫేర్ సెక్రెటరీ శ్రావణి, డిజిటల్ అసిస్టెంట్ నరేష్, ఎమినిటీ సెక్రటరీ శివ,ఏఎన్ఎం మంగ, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular