ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజకు గవర్నర్‌కు ఆహ్వానం

- Advertisement -

ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజకు గవర్నర్‌కు ఆహ్వానం

Governor invited to the inaugural puja of Khairatabad Maha Ganapati.

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజా కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. వినాయక చవితి రోజున ఉదయం 11 గంటలకు జరిగే తొలిపూజకు దంపతులతో కలిసి హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎన్. అశోక్ బాక్సర్, ఎం. మహేందర్ బాబు, ఎం. మహేష్ యాదవ్, ఎస్. రాజ్‌కుమార్, సందీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular