Friday, February 27, 2026

సైంధవ్ సెన్సార్ పూర్తి- U/A సెన్సార్ సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

- Advertisement -

విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైంధవ్ సెన్సార్ పూర్తి- U/A సెన్సార్ సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డ్-  జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 మూవీ ‘సైంధవ్’ సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్‌ ఇచ్చారు. సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా వుంది.‘సైంధవ్’ యూనిక్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. పాటల్లో చూపినట్లుగా, తండ్రీ కూతుళ్ల బంధం సినిమాలో ప్రధాన అంశం, ఇందులో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య మెచ్యూర్ రిలేషన్ షిప్ కూడా మనం చూడవచ్చు. తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్‌గా ఉన్న వెంకటేష్‌కి సహాయం చేయడానికి ఆమె వస్తుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా లాంటి ప్రముఖ నటుల ఈ చిత్రంలో కీలక పాత్రలలో అలరించనున్నారు.ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.  ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
బేబీ సారా పాలేకర్‌తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జిషు సేన్ గుప్తా, జయప్రకాష్‌లు ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్