“ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది”.. స్వగ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మెదక్ ఎస్పీ దేవులపల్లి వెంకట శ్రీనివాస్ రావు

- Advertisement -

“ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది”.. స్వగ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మెదక్ ఎస్పీ దేవులపల్లి వెంకట శ్రీనివాస్ రావు

“One’s native village is like a mother”—everyone must strive for the development of their village: Medak SP Devulapalli Venkata Srinivas Rao.

"One's native village is like a mother"—everyone must strive for the development of their village: Medak SP Devulapalli Venkata Srinivas Rao.
“One’s native village is like a mother”—everyone must strive for the development of their village: Medak SP Devulapalli Venkata Srinivas Rao.

ఆత్మకూరు/ఇస్తలాపురం, వాయిస్ టుడే: ప్రతి ఒక్కరూ తాము పుట్టిన ఊరును కన్నతల్లిలా భావించి, ఆ గ్రామ అభివృద్ధికి తమ వంతు సేవ చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి వెంకట శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.

శనివారం ఆత్మకూరు మండలంలోని ఇస్తలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్ననాటి నుంచి తమ ఎదుగుదలకు తోడ్పడిన స్వగ్రామాన్ని జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా మరవకూడదని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవ చేయాలని సూచించారు.

విద్యార్థులు ఉన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని, విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. స్వగ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో సేవా సంస్థల సహకారంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాలకు రూ.1 లక్ష విలువైన అధునాతన కంప్యూటర్‌ను అందజేయడంతో పాటు విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెయింట్ బాక్స్‌లను అందజేశారు.

సీనియర్ జర్నలిస్టు తూడి జనార్ధన్ మాట్లాడుతూ, ఎస్పీ దేవులపల్లి వెంకట శ్రీనివాస్ రావు తాను చదివిన పాఠశాలను, స్వగ్రామాన్ని ఎప్పటికీ మరచిపోకుండా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కూడా ప్రకటించారు. ప్రథమ బహుమతిగా రూ.5,116, ద్వితీయ బహుమతిగా రూ.3,116, తృతీయ బహుమతిగా రూ.2,116 నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో ఎంఈఓ ధారాసింగ్, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ రాములు, యూత్ ఫర్ సేవ నిర్వాహకులు అరవింద్, విద్యా కమిటీ చైర్మన్ మొరిగాల జానమ్మ, మర్రు బాబూరావు, తూడి నరసింహరావు, సారయ్య, ముత్తయ్య, శ్రీను, పుప్పాల వీరన్న, సాగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఎస్పీని ఘనంగా సన్మానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular