ములుగుకు రెండు పంటలకు సాగునీరుకు కృషి
ములుగు
పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ములుగు పంపు హౌస్ నుండి జంగాల పల్లి,బంజారు పల్లి గ్రామాల చెరువులకు సాగు నీరు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తలపునే గోదావరి ఉన్న ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు మన నీళ్లను తీసుకుపోయి గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది అనిరామప్ప రిజర్వయర్ చేసి పక్క నియోజక వర్గాలకు సాగు నీరు తీసుకుపోయి మనకు మాత్రం చుక్క నీరు ఇవ్వకుండా మన రైతాంగానికి గత ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ ప్రాంత రైతులకు త్వరలోనే రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా నేను కృషి చేస్తానని
త్వరలోనే ముఖ్య మంత్రి ని కలిసి పంపు హౌస్ నుండి మిగితా మండలాలకు కూడా సాగు నీరు ఇచ్చే విధంగా చూస్తానని మంత్రి సీతక్క గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్,మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ములుగుకు రెండు పంటలకు సాగునీరుకు కృషి
- Advertisement -
- Advertisement -


