- Advertisement -
కేంద్ర మంత్రి హరీదీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటి అయ్యారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రోడ్లు భవనాల శాఖ హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు వున్నారు. తెలంగాణకు సంబంధించిన వివిధ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు పైన వివరంగా కేంద్రమంత్రి తో చర్చించారు. మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకారం కోరారు.
- Advertisement -



