అమరనాధ్ కంటితడి

- Advertisement -

 అమరనాధ్ కంటితడి

విశాఖపట్టణం, జనవరి 4

అనకాపల్లి నియోజకవర్గాన్ని వదలాల్సి వస్తుందంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్‌నాథ్.. మంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూనే.. పలు చోట్ల అభ్యర్థులను మార్చుతున్నారు. వైనాట్ 175 టార్గెట్ సీఎం జగన్ పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లికి మలసాల భరత్‌ను సీఎం జగన్ ఇంచార్జిగా నియమించారు. మంత్రి అమర్‌నాథ్‌కు సంబంధించి పార్టీ అధిష్టానం.. ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తరాంధ్రకు సంబంధించిన జాబితాలోనూ మంత్రి అమర్‌నాథ్ పేరును ప్రకటించలేదు.. అంతేకాకుండా.. ఎలాంటి బాధ్యతలను సైతం అప్పగించలేదు.ఈ క్రమంలో సిట్టింగ్ స్థానమైన అనకాపల్లి నియోజకవర్గాన్ని వీడటంపై మంత్రి అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా పునర్జన్మను ఇచ్చిన అనకాపల్లి ప్రజలను వదిలి వెళ్ళలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనకాపల్లిలో వైసీపీ కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో ఈ ఘటన జరిగింది. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటానన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular