మోడీ దెబ్బకు మాల్దీవుల మాడు పగిలింది
న్యూఢిల్లీ, జనవరి8
మన ప్రధాని లక్షద్వీప్ పర్యటన విషయంలో కుప్పిగంతులు వేసి.. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తే ఇండియన్స్ ఊరుకుంటారా… ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. దెబ్బకు విలవిలలాడిపోతోంది. ఎక్కడ మనవాళ్లు వాళ్ల దేశానికి రారో అని భయపడుతోంది. అయినా మాట్లాడే ముందే.. కాస్త ముందూ వెనకా చూసుకోవాలి.మోదీనా.. మజాకా.. మన టూరిజం మీద బతుకుతూ.. మాల్దీవులు ఎగిరెగిరి పడింది. చైనా అండ చూసుకుని మనపైనే తొడకొడదామని ప్రయత్నించి దెబ్బతింది. ఇప్పుడు కొట్టడానికి తొడ కాదు.. చేతిలో తడే లేకుండా పోయే ప్రమాదం ఎదురైంది. అది బతికేదే టూరిజం మీద. అలాంటిది మన ప్రధాని లక్షద్వీప్ పర్యటన విషయంలో కుప్పిగంతులు వేసి.. పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తే ఇండియన్స్ ఊరుకుంటారా… ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. దెబ్బకు విలవిలలాడిపోతోంది. ఎక్కడ మనవాళ్లు వాళ్ల దేశానికి రారో అని భయపడుతోంది. అయినా మాట్లాడే ముందే.. కాస్త ముందూ వెనకా చూసుకోవాలి. నోరు దాటితే ఊరు దాటుతుంది అని తెలియదా? అందుకే మాల్దీవుల పాలకుల పరిస్థితి… ఎలా ఉందంటే.. మనమో సామెత చెబుతాం చూడండి.. కుడితిలో పడ్డ ఎలుక అన్న చందంగా మారిపోయింది. అందుకే మాల్దీవులు బైకాట్ అంటూ గూగుల్ లో ట్రెండ్ అవుతోంది. ఇండియన్స్ దెబ్బ అలా ఉంటుంది మరి.
మాల్దీవుల వార్షిక ఆదాయం దాదాపు రూ.29 వేల కోట్లు ఉంటుంది. ఆ చిన్న దేశానికి అది ఓకే. కానీ ఏటేటా పెరుగుతున్న సముద్రమట్టాన్ని చూసి భయపడే ఆ దేశం.. ఇప్పుడు చైనా అండ చూసుకుని మనపైనే బుసలు కొట్టడానికి ప్రయత్నించింది. ఈ మధ్య ప్రధాని నరేంద్రమోదీ.. మన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్ కు వెళ్లారు. అక్కడే సముద్రపు ఒడ్డున కాసేపు కలియదిరిగారు. స్నార్కెలింగ్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అందుకే సాహస యాత్రను కోరుకునే వారు తమ లిస్ట్ లో లక్షద్వీప్ ను కూడా కలపుకోమని చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి అలా చెప్పారంటే కేవలం సరదా కోసమో, సంతోషం కోసమో కాదు.. దాని వెనుక మాస్టర్ స్ట్రాటజీ ఉంటుంది కదా. దానిని అర్థం చేసుకోని మాల్దీవుల మంత్రులు.. మోదీ పర్యటనపై పిచ్చి ప్రేలాపనలతో విరుచుకుపడ్డారు.మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆమెకు తగిన శాస్తి జరిగింది. లక్షద్వీప్ లో ప్రధాని మోదీ ఉన్న ఒక వీడియోను ఉద్దేశిస్తూ.. అనుచితంగా కామెంట్ చేశారు. దీనిపై భారత్ లో వివిధ వర్గాలు భగ్గుమన్నాయి. బాలీవుడ్ కూడా తీవ్రంగానే స్పందించింది. అక్షయకుమార్ అయితే మన దీవుల్లో పర్యటించి.. మన టూరిజాన్ని సపోర్ట్ చేద్దామని చెప్పేశారు. లక్షద్వీప్ లో మోదీ పర్యటించడం బాగుందని.. అలాంటి పర్యాటక ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయంటూ సల్మాన్ అన్నారు. సెలబ్రెటీలు కూడా ఈ స్థాయిలో స్పందించేసరికీ ఒక్కసారిగా అందరి దృష్టి మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై పడింది. నెటిజన్లు అయితే మాల్దీవుల మంత్రుల కామెంట్స్ పై విరుచుకుపడ్డారు. తాము ఆ దేశానికి వెళ్లాలనుకుని హోటళ్లు బుక్ చేసుకున్నామని వాటిని వెంటనే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు.



