

#..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.#
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట.
గత ప్రభుత్వం అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసింది.
ఎన్ని అవాంతరాలు ఎదురైన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.
అధికారం కోల్పోయిన అధికార దాహంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది.
కూసుమంచి మండల కేంద్రంలో క్యాంప్ కార్యాలయం పునః ప్రారంభోత్సవం.
పాలేరు,వాయిస్ టుడే, జనవరి 10:
పాలకులం కాదు సేవకులమని రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మల్లెల మడుగు ఎదులాపురం కొండాపురం గ్రామాలలో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని దాంట్లో భాగంగానే హెల్త్ సబ్ సెంటర్ లను నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేసి పోయిందని ఖాలి ఖజానా అని దర్శనమిస్తుందని అన్నారు. ఎన్ని అమంత్రాలు ఎదురైనా పేదలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికారం కూల్పోయిన అధికార దాహంతో మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మంత్రి విమర్శించారు. అనంతరం ఎదలాపురం హైస్కూల్లో జరిగిన తల్లిదండ్రుల సన్మాన ఉత్సవ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ పాల్గొని మాట్లాడుతూ..జిల్లాలో 56 ప్రాథమిక ఉప కేంద్రాలను నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో భవనాన్ని 20 లక్షల వ్యయంతో చేపట్టామన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పునః ప్రారంభోత్సవం.
కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రజల దగ్గరికి ప్రజా పాలన అందించే దిశగా అడుగులు వేస్తుందని ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ప్రభుత్వమే తప్ప మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కుసుమంచి క్యాంపు కార్యాలయం పున ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము పాలకులం కాదు సేవకులమని ప్రజలకు సేవ చేయడం కోసమే పనిచేస్తామన్నారు.



