జూబ్లీహిల్స్లో మరో హిట్ అండ్ రన్ కేసు

- Advertisement -

జూబ్లీహిల్స్లో మరో హిట్ అండ్ రన్ కేసు
హైదరాబాద్
జూబ్లీహిల్స్లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది.   పెద్దమ్మ గుడి మలుపు వద్ద ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని  అతి వేగంతో కారు ఢీకొట్టింది. దాంతో    బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.   కారు నడుపుతున్న వ్యక్తి,  బైక్ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు.   జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  మృతి చెందిన యువకుడు నోవాటేల్ హోటల్ లో బౌన్సర్ గా పనిచేస్తున్న లింగాల తారక్ రామ్ గా గుర్తించారు. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా  పారిపోయిన ఆడి కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండేళ్ల క్రితం తారక్ రామ్ కు వివాహం జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉంటారని అనుమానిస్తున్నారు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular