ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
మంథని
మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యూ ఏసీ, జాతీయ సేవా పథకం, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం.డి. తాహెర్ హుస్సేన్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకొని మంచి పాలకులను ఎన్నుకోవాలని తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు.
ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ కోఆర్డినేటర్ రాజనీతి శాస్త్ర అధ్యాపకులు బెజ్జంకి అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆవిర్భావం సందర్భంగా జనవరి 25వ తేదీని మన దేశంలో జాతీయ ఓటరు దినోత్సవం గా జరుపుకుంటున్నామని , ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు ఓటుతో ముడిపడి ఉంటాయి కావున మంచి పాలకులను ఎన్నుకోవాలంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు విధిగా ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. తదనంతరం విద్యార్థులచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ కృష్ణ, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి డాక్టర్. లక్ష్మీనారాయణ, అకడమిక్ కోఆర్డినేటర్ పరిషయ్య,గ్రంధ పాలకులు డాక్టర్. భరత్, అధ్యాపకులు సతీష్ అమర్నాథ్, ముకుందము, మానస, బోధనేతర సిబ్బంది అశోక్, శ్రీనివాస్, సుధాకర్ , రాజు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




