గంజాయి అమ్ముతున్న మఠా అరెస్ట్..
కాలేజీ విద్యార్థులకు సరఫరా చేస్తున్న ముఠా
3 కెజిల గంజాయి స్వాదీనం..
ఇద్దరు నిదుతుల అరెస్ట్..
ఫోటో రైటప్25: మేడిపల్లి01: స్వాదీనం చేసుకున్న గంజాయిని మీడియా కు చూపుతున్న ఎక్సైజ్ పోలీసులు.
మేడిపల్లి,జనవరి 25 (వాయిస్ టుడే) : మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండల పరిసరాల కళాశాలలో గల విద్యార్దులకు గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసి వారినుండి 3 కేజిలా గంజాయిని స్వాదీనం చేసుకున్నా సంఘటన మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలం బోల్లిగూడలో ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసుల ఆద్వర్యంలో జరిగింది… వారు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ అదేశాలు మేరకు మల్కాజ్గిరి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోగల మేడిపల్లి మండల లొని బోల్లి గూడ లో నివాసం ఉంటున్న బంగారి సాయి కుమార్ (19) తండ్రి ఆగయ్య, ఇంట్లో సెర్చ్ చేయగా, కర్రి శివాజీ (23) తండ్రి సత్య రావు,ఎస్వి నగర్ నాగారం మున్సిపాలిటీ, కేసర మండలానికి చేందిన వీరిరువురి నుండి 2 కేజిల ఎండు గంజాయిని, వీరికి సంబందించిన ఇంటి ముందు గల యాక్టీవ 125 స్కూటీ డిక్కీ లొ 1కేజి , మొత్తం 3 కేజీల ఎండు గంజాయి ని స్వాదీనం చేసుకున్నారు. నిందుతులను విచారించాగా గంజాయిని ఒరిస్సా ఏరియా నుంచి తెచ్చి బొల్లి గూడ మరియు మేడిపల్లి చుట్టూ పక్కన గల కాలేజీ విద్యార్థులకు మరియు ఇతర లుకు అమ్ముచున్నామని తెలియజేసారని, వీరినుండి 3 కేజి ల ఎండు గంజాయిని, యాక్టివా 125 బైక్ , రెండు సెల్ఫోన్లు సీజ్ చెసామని, వాటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. ముద్దాయిలు పై ఎన్ ఢీ పీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు. ఈ దాడులలో సిఐ మల్లయ్య, ఎస్ ఐ లు పురుషోత్తం రెడ్డి, శ్రావణి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



