అతి తక్కువ ధరలకే జన ఔషధీ కేంద్రం
అత్యంత నాణ్యమైన ఔషధాలు
కౌతాళం
జన కేంద్రాలలో మందులు కొని ప్రజలు డబ్బులు ఆదా చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనవసిది కేంద్రాలను ఏర్పాటు చేశారని ఒకరి కోసం అందరం అందరూ కోసం ఒకరు అన్న నినాదంతో సాగుతున్న ఔషధీ కేంద్రాలను మందులు కొనుక్కోవాలని వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు దాట్ల కృష్ణంరాజు ప్రజలు సద్యినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంకులో ఏర్పాటుచేసిన జన ఔషధీ కేంద్రం ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవంలో మండల నాయకులు ప్రహ్లాద చారి, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు మారుతి మోహన్, ఉరుకుంద ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాగరాజు గౌడ్, విరా సేన రెడ్డి,మరియు వైసీపీ నాయకులు సుబ్బరాజు, గురు రెడ్డి ,చౌదరి బసవ , ఎ ఓ శేషాద్రి రావు,వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి , ఏకంబి రెడ్డి,తిక్కయ్య, సమద్, రౌడుర్ సుధాకర్ రెడ్డి,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ అతి తక్కువ ధరలు ప్రజలకు అందించే జన ఔషధీ కేంద్రాలలో మందులు కొని డబ్బులు అదే చేసుకోవాలని ప్రజలకు సూచించాలని మండలంలో గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మరియు ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజలకు సమాచారాన్ని అందించాలని కోరారు.




