
యూనియన్ బ్యాంకు మేనేజర్ శీలం రవితేజ, యూనియన్ బ్యాంకు నూతన కరపత్రం
ధర్మపురి : ఫిబ్రవరి 07 (వాయిస్ టుడే)
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక యూనియన్ బ్యాంకు యందు బుధవారం రోజు సాయంత్రం వేళలో నిర్వహించిన యూనియన్ బ్యాంకు సమీక్షా సమావేశం నందు యూనియన్ బ్యాంకు ద్వారా మంజూరు చేస్తున్న ఋణాలను గురించి యూనియన్ బ్యాంకు మేనేజర్ శీలం రవితేజ యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు వివరించారు. యూనియన్ బ్యాంకు ద్వారా అందిస్తున్న గోల్డ్ లోన్ ఒక గ్రామునకు సుమారుగా నాలుగు వేళ ఐదు వందల రూపాయల నుండి నాలుగు వేళ ఎనిమిది వందల రూపాయల వరకు మంజూరు చేస్తున్నట్టు తెలుపుతూ.. అట్టి గోల్డ్ లోన్ వడ్డీ రేట్ (8.8 – 9.3 అనగా డెబ్భై మూడు పైసల నుండి ఎనభై పైసల వరకు) యూనియన్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా వివిధ లోన్ లను మార్కెట్ యందు ఆతి తక్కువ వడ్డీ రేట్ లకే మంజూరు చేస్తున్నట్టు వారు తెలిపారు. గోల్డ్ లోన్ అవసరం ఉండి యూనియన్ బ్యాంకు యందు ఖాతా లేని వారికీ తక్షణమే పది నిముషాలలో యూనియన్ బ్యాంకు యందు నూతన ఖాతా ఓపెన్ చేసి పది నిముషాలలో గోల్డ్ లోన్ మంజూరు చేస్తున్నట్టు వారు తెలిపారు. వ్యవసాయ భూమి ఉన్న రైతు లకు క్రాప్ లోన్ వ్యవసాయ భూమి లేని వారికీ బంగారం కుదువ పెట్టుకోని యూనియన్ బ్యాంకు యందు వ్యవసాయ ఋణాలను ఇస్తున్నాం అని అన్ని బ్యాంకుల కన్నా ఆతి తక్కువ వడ్డీ రేట్ లకే యూనియన్ బ్యాంకు యందు యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నాం అని, నూతన గృహ నిర్మాణం కోసం హౌసింగ్ లోన్, వ్యక్తిగత అవసరాల నిమిత్తం వెహికల్ లోన్ లతో పాటు, చిన్న తరహా పరిశ్రమలతో పాటు, చిన్న తరహా వ్యాపారం కోసం తక్షణమే శిశు ముద్ర లోన్ లతో పాటు మహిళ పోదుపు సంఘాలకు మహిళ గ్రూప్ లోన్ లతో పాటు, యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు ఇన్సూరెన్స్ సేవలు కూడా యూనియన్ బ్యాంకు యందు అందుబాటులో ఉన్నట్టు వారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, యూనియన్ బ్యాంకు ధర్మపురి శాఖ మేనేజర్ శీలం రవితేజ, యూనియన్ బ్యాంకు గోల్డ్ లోన్ అధికారి పెంచాల ప్రసాద్ లతో పాటు, యూనియన్ బ్యాంకు ఖాతాదారులు, యూనియన్ బ్యాంకు సిబ్బంది, ముద్ర లోన్ ఋణా గ్రహీత జైషేట్టి సత్యవతి – లచ్చన్న లతో పాటు, సీనియర్ జర్నలిస్ట్ జైషేట్టి రాకేష్, సామాజిక సేవా కార్యకర్త జైషేట్టి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.



