రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..

- Advertisement -
Three killed in road accident

ఆరుమందికి తీవ్ర గాయాలు
మడకశిర
శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగళి మండలం ఇరిగేపల్లి దగ్గర ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం సిరా తాలూకా ఉచ్చగిర్నహళ్లి గ్రామం నుండి పెళ్లి సంబరం ముగించుకుని   14 మంది టాటా ఏస్ లో తమ ఊర్లకు బయలుదేరారు. హిందూపురం నుంచి సిమెంట్ లారీ లోడ్ శిరవైపు వెళుతు ఇరిగేపల్లి వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. దింతో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న 14 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 6 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు పురుషులు కాగా ఒకరు మహిళ.  రెండు వాహనాలు అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular