హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

- Advertisement -

హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
తిరుపతి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలీ యూనియన్ వారు ఏ.ఐ.టి.యు.సి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏ.ఐ.టి.యు.సి ముఖ్య నాయకులు మాట్లాడుతూ. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఏఐటియుసి పోరాటం చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వాల నుండి హామాలి కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతుందని అన్నారు. హామాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండడం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 6వేలు రూపాయలు  పింఛను అదే విధంగా ప్రమాద బీమా సౌకర్యం కుటుంబంలో చదువుకునే పిల్లలకు, వివాహం జరిగే పిల్లలకు గర్భవతులు అయిన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు.  పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ను సాధించిన ఘనత ఏఐటియుసి దని తెలిపారు. అలాగే ఇప్పుడు కూడా హామాలి కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ చట్టం కావాలి అని పెద్ద ఎత్తున పోరాటాలకు ఏఐటియుసి పూనుకుంటుందనీ అన్నారు. అందుకోసం హమాలి కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలి అని వారు పిలుపునిచ్చారు
ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామనాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ . హమాలీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , జిల్లా అధ్యక్షులు ఎన్ డి రవి , ఏ.ఐ.టీ.యూ.సీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్స్ శ్రీరాములు హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ బాబు నాయకులు నాగరాజు సుబ్రహ్మణ్యం   ఆర్ వి రమేష్ ఏపీ బాల మహేంద్ర అల్లాబక్ష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular