జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
ప్రజావాణి ఫిర్యాదులు 37
జగిత్యాల
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు…సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు,వినతులను అదనపు కలెక్టర్ దివాకర తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 37 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, జగిత్యాల, కోరుట్ల, ఆర్దీవోలు, నర్సింహమూర్తి, రాజేశ్వర్, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు,వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.