రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త అందించబోతోంది..!! రైతు రుణమాఫీ దిశగా చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకులలో రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే రుణమాఫీ ప్రక్రియ కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మొత్తాన్ని పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా రైతులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇచ్చి, రూ.రెండు లక్షల రుణమాఫీకి ప్రణాళికలు రచిస్తోంది. ఉదాహరణకు రూ.25 వేల కోట్లకు బ్యాంకర్లకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లైతే, ఆ మొత్తాన్ని 50 నెలల పాటు ప్రతి నెల రూ.50 కోట్లు వడ్డీతో కలిపి ప్రతి నెల రూ.550 కోట్లు నుంచి రూ.600 కోట్లు చెల్లిస్తే అప్పు తీరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒకేసారి ఆర్థిక భారం పడకపోగా, ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా రుణమాఫీ చేయడంతో పాటు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకోడానికి వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటివరకు రైతులు చెల్లించే పావలా వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం ద్వారా వడ్డీ లేని రుణాలు తీసుకోడానికి అవకాశం ఇవ్వనుంది.
ఏకాలంలో రూ 2 .లక్షల రుణమాఫీ కి ప్రభుత్వం ప్లాన్
Published By Voice Today Team
535

- Advertisement -
- Advertisement -
- Tags
- 10 lakh crore loan write off
- how to apply for pmegp loan in telugu
- how to close personal loan early in telugu
- how to get agricultural loans in telugu
- how to get farmers loans in telugu
- how to get loan under pmegp scheme in telugu
- how to get pmegp loan easily in telugu
- loan write off in india
- procedures to follow when closing a personal loan in telugu
- term insurance plan in telugu
- term plan frequently asked questions in telugu
- term plan in telugu



