సింగోటం రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన ఈటల రాజేందర్…
👉గత వారం రోజుల కింద బీజేపీ యువ నాయకులు, ముదిరాజ్ ముద్దు బిడ్డా సింగోటం రామన్న పరమపదించిన విషయం తెలిసిందే… బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు ద్వారా విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ నేడు సింగోటం గ్రామనికి విచ్చేసి మరణానికి గల కారణాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది..
👉అనంతరం రామన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు తెలియజేశారు ఈటల మరియు ఎల్లేని సుధాకర్ రావు …
👉తదనంతరం మీడియా ముఖంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఒక బడుగు బలహీన వర్గాలకు సంబందించిన సేవగుణం కలిగిన బీజేపీ యువ నాయకుడిని కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా హతమార్చడం తీవ్రంగా బాధించిందని, ఈ మరణం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేదంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ న అనే విషయంపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి నిందితులకు వీలైనంత త్వరగా శిక్షను విధించాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు….
👉 ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తో పాటు ఎల్లేని సుధాకర్ రావు తల్లోజు ఆచారి ,బిజెపి నాయకులు కార్యకర్తలు సింగోటం రామన్న అభిమానులు పాల్గొన్నారు..