పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
మున్సిపల్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి
కోరుట్ల,
: తమ ఇంటి పరిసరాలతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచడం
ప్రతి ఒక్కరి బాధ్యత ఆని కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిశుభ్రత వారోత్సవాల సందర్భంగా వార్డులోని వీధులను శుభ్రం చేశారు. మురికి కాలువలోని మురికిని తీసి బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తో అనేక వ్యాధులు దూరమవుతాయన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. తడి పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ చెత్త బండికి అందించాలని ప్రజలను కోరారు. ఇంట్లో చెత్తను రోడ్లపై మురికి కాలువలలో వేయకూడదని తడి పొడి చెత్త డబ్బాలు పోగు చేసి చెత్త బండికి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్ రమేష్, ఆటో డ్రైవర్ పసుల సాయి, మున్సిపల్ కార్మికులు తదితరులు ఉన్నారు.:




