అయ్యో పాపం విద్యార్థులకు ఎన్ని కష్టాలు
విద్యార్థుల చేత పేడ మొయిస్తున్నా పాఠశాల పిడి వార్డెన్స్
మిట్ట మధ్యాహ్నం మండుటెండలో పేడ కావాడితో విద్యార్థులు
బాకురు జెడ్ పి హై స్కూల్ ఘటన
అల్లూరి
బాకురు జెడ్పి హై స్కూల్ విద్యార్థులు పేడ మోస్తూ విలేకర్ల కంట పడ్డారు.
విద్యార్థులకు ఈ పేడ ఎవరు మొయిస్తున్నారు అని విలేకరుల అడిగితే 10వ తరగతి విద్యార్దులకు పార్టీ వుందని చెప్పి వార్డెన్ మరియు పిడి సార్లు మాకు పేడ తెమ్మని చెప్పారని అందుకే మేము పేడ తీసుకొని వెళ్తున్నట్టు చెప్పారు.ఐతే విద్యార్థులు మండుటెండలో కాలికి చెప్పులు కూడా లేకుండా బక్కెట్లతో కావడి కట్టుకొని పేడ మోస్తున్న వైనం చూసి ఆ దారిలో వేలుతున్న వారు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల చేత ఇలాంటి పనులు చేయించడం అన్యాయమని చదువుకొమ్మని పంపిస్తే పాఠశాలలో ఇలాంటి దుస్తుతి ఉందని ఎండలో మిట్ట మధ్యహ్నం పొలాల్లోకి వెళ్లి ఇన్ని కష్టాలు పడి విద్యార్దు పేడతెవాడం చాలా బాధాకరమని ఇలాంటి సంఘటనలు వలన విద్యార్థులకు ఏమైనా ఐతే బాద్యులు ఎవరని బాధపడుతున్నారు.ఇలాంటి సంఘటనలు గుర్తించి సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.



