- Advertisement -
శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ భారాస సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు, మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో భారాస ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా.. ఉత్తర్వులు చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని.. మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



