వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘అదే నీవు అదే నేను’ మూవీ ‘మనసా మనసా’ సాంగ్ విడుదల

- Advertisement -

వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘అదే నీవు అదే నేను’ మూవీ ‘మనసా మనసా’ సాంగ్ విడుదల

‘Manasa Manasa’ song from the movie ‘Ade Nuvvu Ade Nenu’ released by V.V. Vinayak.

హైదరాబాద్, వాయిస్ టుడే న్యూస్: రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న “అదే నీవు అదే నేను” చిత్రం నుంచి తొలి మెలోడీ ‘మనసా మనసా’ పాటను స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

“కమిటీ కుర్రోళ్లు” చిత్రం ద్వారా గుర్తింపు పొందిన త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై కాండ్రేగుల గోవిందు నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు కొండల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంలోని పాటల ఆడియో హక్కులను ప్రముఖ సంగీత సంస్థ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. సినిమా పాటలు నచ్చడంతో ఆడియో విడుదలకు ముందుకు వచ్చిన ఆదిత్య మ్యూజిక్‌కు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ, “కొండల్ తొలి చిత్రానికే మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఈ సినిమా ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకురావాలి. నిర్మాత గోవిందు గారికి ఇది తొలి సినిమా. నిర్మాతగా ఈ చిత్రం విజయవంతమై మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. ‘మనసా మనసా’ పాట చాలా బాగుంది. చిత్రబృందం మొత్తం కష్టానికి మంచి ఫలితం దక్కాలని, సినిమా సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నాను” అన్నారు.

ఆకట్టుకుంటున్న ‘మనసా మనసా’ మెలోడీ

‘మనసా మనసా’ పాటను దర్శకుడు కొండల్ ఎంతో అందంగా, భావోద్వేగాలతో చిత్రీకరించారు. రొమాంటిక్ ఫీల్‌ను సెన్సిబుల్‌గా, కవితాత్మకంగా తెరపై ఆవిష్కరించడం ఈ పాట ప్రత్యేకతగా నిలిచింది.

పూర్ణాచారి అందమైన సాహిత్యాన్ని అందించగా, సంగీత దర్శకుడు కనిష్క మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మధురమైన స్వరాలను సమకూర్చారు. ప్రముఖ గాయకుడు జావేద్ అలీ తన మధుర గాత్రంతో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. కొరియోగ్రాఫర్ వేద రూపొందించిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.

హీరో త్రినాథ్ వర్మ, హీరోయిన్ తన్వీ నేగి మధ్య కనిపించే రొమాంటిక్ కెమిస్ట్రీ, డీవోపీ నిమ్మల జయపాల్ రెడ్డి అందించిన కలర్‌ఫుల్ విజువల్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. విడుదలైన వెంటనే ఈ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది.

చిత్ర విశేషాలు

“అదే నీవు అదే నేను” చిత్రం ప్రేమ, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అంశాల సమ్మేళనంగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ‘మనసా మనసా’ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రానుంది.

నటీనటులు: త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ తదితరులు.

సాంకేతిక బృందం:
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
సాహిత్యం – పూర్ణాచారి
డైలాగ్స్ – వై. అమ్మిరాజు
ఛాయాగ్రహణం – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ – ఛోటా కె. ప్రసాద్
సంగీతం – కనిష్క
నిర్మాత – కాండ్రేగుల గోవిందు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం – కొండల్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular