అందరికి న్యాయం చేయడమే ప్రథమ కర్తవ్యం
గంజాయి స్మగ్లర్లు పై ఉక్కు పాదం
ప్రజలకు అందుబాటులో ఉంటా
మెట్ పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు
కోరుట్ల,
తన పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రథమ కర్తవ్యమని నూతన బాధ్యతలు చేపట్టిన
మెట్ పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు ఆన్నారు..
మెట్ పల్లి లో విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ రవీందర్ రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.ఈ మేరకు
గురువారం
మెట్ పల్లి డీఎస్పీగా ఉమా మహేశ్వర రావు బాధ్యతలు స్వీకరించారు.. నూతన డీఎస్పీగా నియమితులైన ఉమా మహేశ్వర రావు గతంలో
హైదరాబాద్ లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్వర రావు మాట్లాడుతూ
మహిళలపై నేరాలు జరగకుండా ప్రత్యేక ప్రత్యేక దృష్టి సారిస్తాన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజల లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తమ ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.. రానున్న ఎన్నికల నైపద్యంలో ఎలక్షన్ కమిషన్ నియమావళి నిబంధనలోబడి పని చేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు ప్రజా సమస్యలపై అన్నివేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.. డివిజన్ పరిధిలోని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు, ప్రజా సంఘాలు, పోలీసులకు సహకరించాలని కోరారు.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని డిఎస్పి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని
అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం, గంజాయి, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాబోయేది ఎలక్షన్ సీజన్ కావున డివిజన్ పరిధిలో నిగా ఎక్కువ ఉంటుందని, అల్లర్లకు, గొడవలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.. ఎటువంటి గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతతో పోలీసులకు సహకరించాలని తెలిపారు
జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ
మెట్ పల్లి డీఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఉమామహేశ్వర రావు గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందజేశారు. మెట్ పల్లి డివిజన్ లో శాంతిభద్రతల పర్యవేక్షణకు పాటుపడాలని ఎస్పీ సూచించారు.



