పోలీసు అధికారులకు డీజీపీ అభినందన
విజయవాడ విశాఖపట్నం లో జనవరి 18 నుండి 30 వరకు జరిగిన 14వ అఖిల భారత పోలీసు కమాండో పోటీల ను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులను డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.
దేశంలో ఇప్పటి వరకు, వివిధ రాష్ట్రాలలో మొత్తం 13 అఖిల భారత పోలీసు కమాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా సామర్థ్యం, విశ్వాస స్థాయిలు, శారీరక మరియు మానసిక ప్రమాణాలు, జట్టు కృషి మొదలైవి పెంపొందించాడానికి ఉపయోగపడతాయి. ప్రతిష్టాత్మకమైన 14వ (అఖిల భారత పోలీసు కమాండో పోటీల)AIPCC–2023-24ను ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ తరుపున జనవరి 18 నుంచి 30 వరకు విశాఖపట్నం లోని గ్రేహౌండ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం లో నిర్వహించారు.
ఈ పోటీలలో వివిధ ట్రోఫీలు, బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో టీం, రణ-నీతి, చక్రవ్యూహ్-1 రూరల్ & చక్రవ్యూహ్-2 అర్బన్, బ్లాక్ హాక్ ఫైరింగ్, చీతా రన్, బెస్ట్ టీం ఇన్ కాన్ఫిడెన్స్ కోర్సు, కమాండో కంపిటషన్ హార్డ్ లైనర్ (బ్రోంజ్), కమాండో కంపిటషన్ రన్నర్-అప్ (సిల్వర్), కమాండో కంపిటషన్ విన్నర్ (గోల్డ్) వంటి మొత్తం 10 ట్రోఫీల కోసం 300 మండి తో కూడిన వివిధ రాష్ట్రాలు, కేంద్ర దళాలకు చెందిన 23 జట్లు పోటీ పడి తమ అత్యున్నత నైపుణ్యాలను ప్రదర్శించాయి.
ఏపి గ్రేహౌండ్స్ జట్టు 10 ట్రోఫీలలో 05 ట్రోఫీలు, బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో టీం (జయలలిత, Ex-CM of TN ట్రోఫీ ), చక్రవ్యూహం 1 రూరల్, బెస్ట్ బ్లాక్ హాక్ ఫైరింగ్, టీం ఇన్ కాన్ఫిడెన్స్ కోర్సు గెలుచుకుంది. , తద్వారా, గ్రేహౌండ్స్ జట్టు ఓవర్ఆల్ విజేత గా నిలవడం తో కొమండో పోటీలలో స్వర్ణం సాధించి మొదటి స్థానం లో నిలిచింది. రన్-నీతి ట్రోఫీ బిఎస్ఎఫ్ కు, చక్రవ్యూహం 2 అర్బన్ మహారాష్ట్ర టీం, చీతా రన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ శ్రీ బిజేంద్ర, కమాండో కంపిటషన్ హార్డ్ లైనర్ (బ్రోంజ్)/మూడవ స్థానం రాజస్తాన్, కమాండో కంపిటషన్ రన్నర్-అప్ (సిల్వర్)/రెండవ స్థానం లో మహారాష్ట్ర విజేతలుగా నిలిచారు.
అఖిల భారత పోలీసు కమాండో పోటీల్లో అగ్రస్థానం లో నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసు కమాండో టీంలను ఈ రోజు పోలీసు ప్రధాన కార్యాలయం లో డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు .
Readmore:మేడారం జాతరకు హెలీకాప్టర్



