- Advertisement -
నేవీ కోసం 200 బ్రహ్మోస్ మిసైళ్లు
భారత నేవీ అమ్ములపొది మరింత పటిష్ఠం కానుంది. యుద్ధ నౌకల కోసం 200 బ్రహ్మోస్ ఎక్స్ టెండెడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.19వేల కోట్లు విలువైన ఈ మెగా డీల్ను కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదించింది. మార్చి మొదటి వారంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్, రక్షణశాఖ దీనిపై అధికారికంగా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రహ్మోస్ మిసైళ్ల ఎగుమతి కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
- Advertisement -



