కృష్ణా నది బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు షురూ.

- Advertisement -

రేపటి నుంచి కృష్ణా నది బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు షురూ..

మక్తల్ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణ నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి జాతీయ రహదారి 167 పై మార్చి 2వ తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయని రాయచూర్, మక్తల్ పోలీసులు తెలిపారు.

కృష్ణా నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి పై రోడ్డు గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో బ్రిడ్జి మరమ్మతుల కారణంగా గత 45 రోజుల క్రితం జనవరి 17వ తేదీ నుంచి వంతెన పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

బ్రిడ్జి పైన ఉన్న పాత రోడ్డుని తొలగించి కొత్త సిమెంట్ రహదారి ని ఏర్పాటు చేసేందుకు ఇటు తెలంగాణ అటు కర్ణాటక కు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రస్తుతం బ్రిడ్జి మరమ్మత్తులు క్యూరింగ్ పనులు పూర్తైనందున మార్చి 2వ తేదీ తెల్లవారుజామున నుంచి రాకపోకలు ప్రారంభం అవుతాయని రాయచూరు,మక్తల్ పోలీసులు సమాచారమిచ్చారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular