Thursday, April 30, 2026

ఇస్రో.. టార్గెట్‌ 25

- Advertisement -

ఇస్రో.. టార్గెట్‌ 25

చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు

వ్యోమగామిని పంపడమే లక్ష్యం

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) చేపట్టాల్సిన ప్రయోగాలకు సంబంధించి 25 ఏళ్ల కాలానికి దార్శనిక పత్రాన్ని రూపొందించామని ఆ సంస్థ చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేయాలని, జాబిల్లిపైకి భారత వ్యోమగామిని పంపాలని ఈ పత్రంలో పొందుపరిచామని చెప్పారు. దీంతోపాటు శుక్రుడు, అంగారకుడుపై కూడా ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం జరిగిన డాక్టర్‌ పిన్నమనేని, సీతాదేవి ఫౌండేషన్‌ 30వ వార్షికోత్సవంలో సోమనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్‌ పిన్నమనేని, సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్‌-3 విజయం వెనుక కొన్ని తరాల కృషి ఉందని.. ఆ ఫలితాన్ని తాము అనుభవిస్తున్నామని వెల్లడించారు. ఇస్రోలో అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు పనిచేశారని, వాళ్లే తనకు గురువులు, మార్గదర్శకులు అని చెప్పారు. ఇస్రోలో తాను తొలుత ఎస్‌ఎల్వీ, ఆ తర్వాత పీఎ్‌సఎల్వీ, ఎల్‌ఎ్‌సఎం ప్రాజెక్టుల్లో పనిచేశానని, ఈ మూడు ప్రాజెక్టుల్లో కలిగిన అవగాహన, స్ఫూర్తి, కృషి చంద్రయాన్‌-3 విజయవంతం కావడానికి కారణమయ్యాయని చెప్పారు.చంద్రుడిపై నీటి జాడలను ప్రపంచంలో తొలిసారిగా కనుగొన్నది మనమేనని స్పష్టం చేశారు. తాను ఎల్వీఎం-3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రాకెట్‌ను డిజైన్‌ చేశానని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్