మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

- Advertisement -

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి- లక్ష్మణ్

జగిత్యాల,
మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే మహిళ సాధికారత సాధ్యమవుతుందని
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  పేర్కొన్నారు.గురువారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జగిత్యాల ఐడీవోసీ  సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం వేడుకలు ముఖ్య అతిథులుగా
జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ భాష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ… మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా
స్వావలంబన  సాధించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు.. మహిళలు మగవారి కంటే కొన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని వారు ప్రస్తుత పరిస్థితుల్లో సృజనాత్మకత, కొత్త ఆలోచనతో సమాజంలో ముందుకు వెళ్తున్నారని ప్రసశించారు.. మహిళలకు అన్ని రంగాల్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారిని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే విధంగా చూడాలన్నారు. మహిళలకు ప్రభుత్వ వివిధ పథకాల ద్వారా పూర్తి చేయాత అందిస్తుందని తెలిపారు.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వయం, సహాయక సంఘాల ద్వారా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, మహిళలు దానిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలన్నారు.
మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాయికల్ జడ్పీటిసి అశ్విని, జిల్లా సంక్షేమ అధికారిణి వాణి, అధికారులు, వివిధ శాఖలలో మహిళా ఉద్యోగినీలు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular