కళలు మన జాతి సంపద
– మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి
హైదరాబాద్, మార్చి 18 () :
శాస్త్రీయ జానపద కళలు మన దేశ వారసత్వ సంపదలని డా!! వేణుగోపాల చారి అన్నారు.సృజన అర్ట్ థియేటర్స్ 34 వ వార్షికోత్సవం సందర్భంగా సీల్ వెల్ సౌజన్యంతో రవీంద్ర భారతిలో వైభవంగా నిర్వహించిన కళాసౌరభ 2023 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.చిన్నారులకు మన సాంప్రదాయం సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి కలిగించి వారి ప్రతిభలకు పట్టం కట్టాలని,ఈ దిశగా తల్లి తండ్రులు గురువులు తమ దృష్టిని సారించాలని ఆయన కోరారు. సరస్వతి ప్రసన్న దైవజ్ఞ శర్మ సభకు అధ్యక్షత వహించగా, నృత్య గురువులు ఝాన్సీరాం, హరిణి కందాళ, స్వరాజ్య లక్ష్మి, రాధికా శ్రీ నివాస్, సంస్థ అధ్యక్షులు పురుషోత్తం నారగౌని , వ్యాఖ్యన బ్రహ్మ గాంధీ, సీనియర్ జర్నలిస్టు రత్నాకర శర్మ లు అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.గురువులకు నాట్య మయూరి, నర్తనబాలలకు నాట్య దీప్తి పురస్కారాలు ప్రదానం చేశారు




