హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో యాసంగి (రబీ) వరికోతలు మొదలయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కోతలు ఇప్పటికే ప్రారంభమవగా, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు మొదలవుతాయా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా బియ్యం ధరలు పెరుగుతుండటంతో కొందరు రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం పరిమాణం తగ్గే అవకాశం ఉందని పౌరసరఫరాల సంస్థ అభిప్రాయపడుతోంది. గత సంవత్సరం రబీలో 66.85 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా. ఈ సీజన్‌లో 60-70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడువేలకు పైగా కేంద్రాలను ఏర్పాటుచేయాలని అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా నిజామాబాద్ ఆ తర్వాత సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో ఏర్పాటుకానున్నాయి…
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు
Published By Voice Today Team
170

- Advertisement -
- Advertisement -
- Tags
- against the grain
- best gluten free grains
- gluten free grains list
- grain
- grain de cafe naples fl vlog
- grain free diet
- grain mill
- grain storage techniques
- grains
- grains storage
- making tote bags from feed sacks
- middle east grain export
- middle east grain exporter
- middle east grain import
- middle east grain importer
- pleasant hill grain
- purchase of wheat
- store grains
- store grains pests free
- storing kefir grains
- wheat purchase center
- wholesale dried grains



