మేడ్చల్ జిల్లా:
మందికి పుట్టిన పిల్లలు తనపిల్లాలని చెప్పుకొని తిరినట్లుంది రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తీరు అంటూ ఘాటైన విమర్శలు చేశారు బి.అర్.ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్. నీకు దమ్ముంటే ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్విచ్చిన చార్ సౌ బిస్ హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము అంటూ రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బి.అర్.ఎస్, బిజేపి మధ్యే పోటీ ఉంటుందని అన్నారు కెటిఆర్. మల్కాజిగిరి పార్లమెంట్ కు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని బరిలో దింపిందన్నారు. మేడ్చల్ జిల్లా ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఎంచేసిందో మా మల్లన్న దగ్గర లిస్టు ఉందన్న కెటిఆర్, బిజేపి ఎంచేసిందో ఆ పార్టీ చెప్పాలన్నారు. రాష్ట్రంలో రేవంత్ తీరు హాస్యాస్పదంగా ఉందన్న కెటిఆర్, స్కైవే కోసం బి.అర్.ఎస్ ప్రయత్నం చేస్తే అది కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నది అని విమర్శించారు. స్కైవే రావడానికి ఢిల్లీలోని తెలుగు అధికారి గిరిధర్ కారణమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరని కెటిఆర్ అన్నారు.
నువ్విచ్చిన చార్ సౌ బిస్ హామీలు నెరవేర్చు
- Advertisement -
- Advertisement -