మాస్ జాతర..పుష్ప 2 టీజర్ మాములుగా లేదు కదా..
బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 త్వరలో థియేటర్లోకి రాబోతోంది. ఈ ఏడాది ఆగష్టు 15 న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “పుష్ప 2: ది రూల్” అనే టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానున్నది. ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్బంగా మూవీ మేకర్స్ టీజర్ ను విడుదల చేసారు.
గంగమ్మ తల్లి జాతరలో సెట్ చేయబడిన ఈ టీజర్‌లో అల్లు అర్జున్ చీర-గెటప్‌లో కనిపించాడు. మేడలో నిమ్మకాయలు దండ, పూలమాల , కాళ్లకి గజ్జెలు, కళ్ళకి కాటుక, చీవిలి వేసుకొని ఒక చేతిలో శంఖం,మరొక చేతిలో త్రిశూలం పట్టుకొని పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. టీజర్ లో రౌడీలను స్టైలిష్ గా కొట్టే సన్నివేశాలకు ఫాన్స్ మాత్రం విజిల్ వేయక తప్పదు. ఒక నిమిషం 8 సెకన్లు ఉన్న ఈ టీజర్ ని చూస్తుంటే ఎవరికైన బుర్ర పాడైపోయేలా ఉంటుంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు ఎందుకు ఇంత టైం తీసుకున్నాడో టీజర్ చూస్తుంటే అర్థం ఐతుంది. అద్భుతమైన విజువల్స్, సౌండ్ డిజైన్, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు రెడ్ కలర్ ప్యాలెట్ చాలా బాగా మెప్పించింది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పుష్ప 2 ఇండియా సినీ రంగని మళ్లీ ఊపేస్తున్నట్లు కనిపిస్తోంది.



