ఆ సారు రూటే సపరేటు?

- Advertisement -

ఆ సారు రూటే సపరేటు?
– లింక్ వర్కర్ బాలకిషన్ అన్న విషయం వైద్యాధికారులకే తెలియదు
– ఇక ఆ లింకు వర్కర్ బాధితులకు ఏమి న్యాయం చేసెను.
– బాలకిషన్ పై ఆ సంస్థకు సంబంధించిన శాఖ నుంచి చర్యలు తీసుకునేనా?
కామారెడ్డి బ్యూరో ఏప్రిల్ 9 వాయిస్ టుడే
కామారెడ్డి జిల్లా దొమకోండ లో, ఒక ఎన్జీవో సంస్థ నుంచి దోమకొండ ఉమ్మడి మండలానికి లింక్ వర్కర్ గా బాలకిషన్ ను విధుల్లో పెట్టారు. అయితే ఆయన చేయవలసిన విధివిధానాలు, ప్రజలకు తెలియజేయవలసిన అంశాలు, గ్రామసభల్లో వివరించవలసిన సలహాలు,సూచనలను ప్రజలకు తెలియజేయకుండా తనంతట తానే ఉంటూ ఆ సంస్థ ఇచ్చే జీతభత్యాలు మాత్రం వెనుకేసుకుంటున్నాడు. ఆయన లింకు వర్కర్ గా ఉన్నట్లు మండలంలో పట్టుమని పదిమందికి కూడా తెలియదంటే ఆశ్చర్యపడ వలసిన విషయం. దోమకొండ లో ఉన్నటువంటి ఆసుపత్రి సూపరిండెంట్ తో పాటు బీబీపేట మెడికల్ ఆఫీసర్లకు లింకు వర్కర్ గాలి బాలకిషన్ అని ఇప్పటికీ తెలియదు. ఈ సారు తన రూటే సపరేటు అంటూ తను చేసే సంస్థతో పాటు ఇటు సంబంధిత బాధితులకు సైతం అన్యాయమే చేస్తున్నారు. లింకు వర్కర్ గా బాలకిషన్ ఉన్నట్లు వైద్యాధికారులతోపాటు ఇతర ప్రజలకు గాని, ప్రజా ప్రతినిధులకు గాని తెలియకపోవడం గమనార్హం. అంటే ఆ సారు చాప కింది నీరులా ఉంటూ ఆ సంస్థ నుంచి బాధితులకు అందవలసినవి అందియకుండా వైద్యుల వద్దకి వెళ్లి పరిచయం చేసుకోకుండా ఉన్నాడంటే అతను ఎంత ఆరితేరి మండలంలో కొనసాగుతున్నాడు అంటే ఆలోచించవలసిన విషయం. అతనిపై ఆ సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే?

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular