మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలి – కేఏ పాల్

- Advertisement -

మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలి
-ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై దేశ అత్యున్నత విచారణ సంస్థ ఆయన సిబిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య మంత్రి ఆయన తక్షణమే మెగా దోపిడీపై సిబిఐ విచారణ కోతామని చెప్పిన రేవంత్ రెడ్డి 120 రోజులు దాటిన ఆ విషయంపై మాట్లాడడం లేదని మండిపడారు. తాను మెగా కృష్ణారెడ్డి పై హైకోర్టులో కేసు వేసి తొమ్మిది వందల పేజీలకు పైగా దస్త్రాలను సమర్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు బుధవారం మరో మారు విచారణకు రానుందని న్యాయస్థానంలో ఈ అంశంపై వాదిస్తానని చెప్పారు. ఆర్ గ్యారంటీ లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహానగరంలో మంచినీటి సమస్య విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular