- Advertisement -
మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ
పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనులపై ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు నిరసన తగిలింది. సింగరేణి కార్మికుల ఓట్ల కోసం వచ్చిన ఈశ్వర్ ను మహిళా కార్మికులు అడ్డుకున్నారు. గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. ఈశ్వర్ కు మద్దతుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మహిళా కార్మికులు వినిపించుకోలేదు.
- Advertisement -



