పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లతో పోలిస్తే CNG కార్లు డబ్బును చాలా పొదుపు చేస్తాయి. ఇప్పుడు దాదాపు ప్రతి కార్ల కంపెనీ మార్కెట్లోకి CNG కార్లను విడుదల చేస్తోంది. అయితే, ప్రజలు మార్కెట్లో ఎన్ని CNG కార్లు ఉన్న..ఇప్పటికీ మారుతి సుజుకి CNG కార్లును చాలా
ఇష్టపడుతున్నారు. కారణం అవి అత్యధిక మైలేజీని ఇవ్వడం. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా అత్యధిక మైలేజీని ఇచ్చే మారుతి సుజుకి చౌకైన CNG కార్ల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి
వ్యాగన్-ఆర్ భారతీయ కుటుంబాలకు ఇష్టమైన కారు అని చెప్పొచ్చు. ఇది మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది. పెట్రోల్‌తో పాటు ఇది సిఎన్‌జిలో కూడా లభిస్తుంది. ఈ కారు CNG మోడ్‌లో 33.47 km/kg మైలేజీని ఇస్తుంది. కాగా, దీని ధర రూ.6.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కారులో 1.0L మరియు 1.2L పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి.
మారుతీ సుజుకి సెలెరియో CNG
మారుతి సెలెరియో కొత్త డిజైన్తో మార్కెట్లోకి విడుదలైంది. ఇది పెట్రోల్‌తో పాటు CNG వెర్షన్ లో ఉంది. ఈ కారు CNG మోడ్‌లో 34.43 km/kg మైలేజీని ఇస్తుంది. సెలెరియో సిఎన్‌జి ధర రూ.6.73 లక్షలు గా ఉంది. దీని ఇంజిన్ కూడా మంచి పనితీరును ఇస్తుంది. ఈ కారులో 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు.
మారుతీ సుజుకి ఆల్టో
మారుతీ సుజుకికి చెందిన ఆల్టో అత్యంత చవకైన CNG కారు. ఈ కారు CNG మోడ్‌లో 31.59km/kg మైలేజీని ఇస్తుంది. ఆల్టో సిఎన్‌జి ధర రూ.5.13 లక్షలు గా ఉంది. ఇది చిన్న కుటుంబానికి మంచి కారు అని చెప్పొచ్చు. ఇందులో 800సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు.12:46 PM



