- Advertisement -
దేశం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారం లోకి రావాలని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఘట్కేసర్ మున్సిపాలిటీలో గురుకుల్ కళాశాలలో ఓటర్స్ అసోసియేషన్ సభ్యుల్ని ఈటల రాజేందర్ కలిసి మాట్లాడారు.
ఆప్ కి బార్ 400 కి పార్ నినాదంతో ప్రచారంలో ముందుకు వెళ్తున్న బిజెపికి దేశంలో మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థిగా అతనికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని అందుకు ఓటర్స్ అసోసియేషన్ పూర్తిగా సహకరించాలని ఆయన చెప్పారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ తో సహా పలువురు ఈటల తో కలిసి కాసేపు ముచ్చటించిన బిజెపి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
- Advertisement -