వ్యవసాయానికి నీళ్లివ్వడం కుదరదు.. ఆరుతడి పంటలే వేసుకోండి

- Advertisement -

రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన.. 8 నుంచి 10 నెలలు అత్యంత గడ్డు పరిస్థితులు

It is not possible to provide water for agriculture; please cultivate only ‘dry-land’ (rain-fed/low-water-requirement) crops.

హైదరాబాద్, అక్టోబర్ 23 (వాయిస్ టుడే):

రాష్ట్రంలో రానున్న నెలల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, వ్యవసాయానికి సాగునీరు అందించడం కష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు వరి వంటి నీటి వినియోగం అధికంగా ఉండే పంటలకు బదులుగా కూరగాయలు, చిన్న, సన్న ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.

శుక్రవారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కీలక సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఎల్‌నినో ప్రభావం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 50 శాతం బోర్లు ఎండిపోయాయని సీఎం వెల్లడించారు. నవంబర్ నుంచి ఎండాకాలం వరినాట్లు ప్రారంభమవుతాయని, ఆ సమయంలో చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. శ్రీశైలం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో 20 శాతం నీళ్లు కూడా లేవని, అందుబాటులో ఉన్న సుమారు 200 టీఎంసీల నీటిలో కొంత డెడ్ స్టోరేజీ ఉందని తెలిపారు. తాగునీటి అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు నీటిని వినియోగించే పరిస్థితి లేదన్నారు.

రానున్న 8 నుంచి 10 నెలల పాటు రాష్ట్రం అత్యంత ప్రమాదకరమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితిని క్యాన్సర్ వ్యాధి తొలి దశతో పోలుస్తూ, ముందుగానే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు సూచించారు.

RELATED ARTICLES

spot_img

Most Popular