వాట్సాప్ లో సరికొత్త ఫీచర్..

- Advertisement -

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్..ఒక్క క్లిక్ తో instaలోను స్టేటస్ ను షేర్ చేయొచ్చు..

Meta తన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కలిపి కనెక్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్ త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌తో కనెక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఫేస్‌బుక్-వాట్సాప్ మరియు ఫేస్‌బుక్-ఇన్‌స్టాగ్రామ్‌లలో క్రాస్ పోస్టింగ్ ఎంపిక అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్‌లకు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ కొత్త ఫీచర్ రాకతో వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ రెండింటిలో స్టేటస్‌ను షేర్ చేసే ఎంపిక ఒకేసారి అందుబాటులోకి వస్తుంది. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే..యూజర్లు మళ్లీ మళ్లీ అదే విధానాన్ని పునరావృతం చేయనవసరం లేదు. యూజర్లు ఒకే స్టేటస్ లేదా స్టోరీని షేర్ చేయాలనుకుంటే..వారు వేర్వేరు యాప్‌లకు రెండుసార్లు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది యూజర్లకు సమయం ఆదా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ ఐచ్ఛికంగా ఉంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular