సినీ హాస్య నటుడు రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -

*సినీ హాస్య నటుడు రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి*

నల్గొండ జిల్లా :ఏప్రిల్ 18
రఘుబాబు కారు ఢీకొని నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పానగల్ రహదారి పైన బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు.

టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌ రావు (48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయం త్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.

వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు కారు ను స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు.. వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టారు.

దీంతో జనార్దన్‌రావు ఎగిరి డివైడర్‌ మీద పడ్డారు. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదు తో రఘుబాబును అదుపు లోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసినట్లు సీఐ డానియేల్‌ తెలిపారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular