రేవంత్ కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్, మే 8
భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె క్రిషాంక్ కు కేటీఆర్ జైల్లో పరామర్శించారు. ఒకటో తేదీన ఆయనను ఓయూ సెలవులపై ఫేక్ సర్క్యూలర్ ను వాట్సాప్ లో .. సోషల్ మీడియాలో వైరల్ చేశారని అరెస్టు చేశారు. అప్పట్నుంచి రిమాండ్ లో ఉన్న క్రిషాంక్ కు కేటీఆర్ బుధవారం పరామర్శించారు. ఆ తర్వాత క్రిషాంక్ సతీమణి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి ఉందన్నారు. క్రిషాంక్ సోషల్ సోషల్ మీడియాలో పోస్టు చేసినదే అసలైనదని.. రేవంత్ రెడ్డినే పేక్ సర్క్యూలర్ పోస్టు చేశాడని కేటీఆర్ విమర్శించారు. ఈ అంశంపై నిజానిజాలు తేల్చుకునేందుకు రావాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసింది నిజమైనది అయితే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అది ఫేక్ అని తేలితే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారా అని సవాల్ చేశారు. దుమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని వెంటనే క్రిశాంక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పాలని క్రిశాంక్‌పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ నెలాఖరులో ఓయూ క్యాంపస్ ను నీటి కొరత, కరెంట్ కొరత కారణంగా మూసి వేస్తున్నట్లుగా ఓ సర్క్యూలర్ వైరల్ అయింది. బీఆర్ఎస్ నేతలు ఈ సర్క్యూలర్ ను హైలెట్ చేశారు. అయితే ఓయూకు ఎప్పటి మాదిరిగానే సెలవులు ఇచ్చారని నీటి కొరత, కరెంట్ కొరత కారణం కాదని.. బీఆర్ఎస్ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు స్వయంగా మండిపడ్డారు. కేసీఆర్ కూడా ఓయూ ఇష్యూపై సోషల్ మీడియాలో స్పందించారు. తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సమాధానం ఇస్తూ.. ట్వీట్ చేశారు. ఫేక్ పోస్టులు పెట్టి గోబెల్స్ ను మించినపోయారని విమర్శించారు. తానే స్వయంగా ఇదీ ఒరిజినల్ అని ఓ సర్క్యూలర్ ను పోస్ట్ చేశారు. అయితే తమదే నిజమని రెండు పార్టీల నేతలు వాదులాడుకోవడం ప్రారంభించారు. అయితే తమ సర్క్యులర్ ను ఎడిట్ చేశారని ఓయూ వార్డెన్ ఫిర్యాదు చేయడంతో ఓయూ పోలీసులు క్రిషాంక్ మీద కేసు పెట్టారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో చౌటుప్పల్ వద్ద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన గత ఎనిమిది రోజులుగా జైల్లో ఉండాల్సి వస్తోంది.
రేవంత్ కు కేటీఆర్ సవాల్
- Advertisement -
- Advertisement -