దేవుడి సాక్షిగా కౌశిక్ రెడ్డి అబద్ధాలు..
– అరోపణలు కాదు సాక్ష్యాలు ఏవీ కౌశిక్ రెడ్డి?
– ఆధారాలతో మాట నిలబెట్టుకున్న ప్రణవ్,ఆధారాలు లేక పారిపోయిన కౌశిక్ రెడ్డి.
– ఓవర్ లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదు?
– అబద్ధాలు ఆడడంలో రాష్ట్ర పరిధి దాటాడు.
– ఇకపై హుజురాబాద్ లో నిన్ను ఎమ్మెల్యేగా గుర్తించం.
– కౌశిక్ రెడ్డి ఒక జోకర్
– ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలైనా ఒక్క మంచి పని హుజురాబాద్ కు చేశారా?
– హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు.
హుజురాబాద్ జూన్ 25 (వాయిస్ టుడే) : హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరుతో తమని మోసం చేశాడని బాధితులు స్పష్టమైన ఆధారాలతో చెల్పూర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చిన కూడా తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఆసత్యమైన ఆరోపణలు మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు అన్నారు.కౌశిక్ రెడ్డి విసిరిన సవాలుకు తాము సిద్ధమని ప్రకటించిన తర్వాత దాంట్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సవాల్ విసిరగా దానికి కౌశిక్ రెడ్డి వస్తానని అన్నారు.కానీ తన చిత్తశుద్ధి కౌశిక్ రెడ్డి మనస్సాక్షికి తెలుసునని కౌశిక్ రెడ్డి చెప్పినవన్నీ అభధ్ధాలు అని,ఎమ్మెల్యేగా తన దగ్గర ఆధారాలతో ఆరోపణలు చేయాలే గాని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దని అన్నారు.స్థాయికి మించి మంత్రి పై అరోపణలు చేసే కౌశిక్ రెడ్డి ఆధారాలు చూపాలని అన్నారు.తాము విసిరిన సవాల్ కు కట్టుబడి తాము ఆధారాలతో సహా మీడియా ముందు ప్రవేశపెట్టామని స్వయంగా ఎవరైతే డబ్బులు ఎమ్మెల్యేకు ఇచ్చారో వారే చెల్పూర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో తడి బట్టలతో కొబ్బరికాయ కొట్టారని,మీడియా సమక్షంలో కౌశిక్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని చెప్పారని,కానీ ఎమ్మెల్యే దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపెట్టమని అడిగితే ఓవర్ లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేసి పారిపోయాడని అన్నారు.దేవుడి పై ఒట్టేసి అబ్దద్ధాలు ఆడడం సిగ్గు చేటనీ,ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మంచిది కాదని,ఎన్నికల సమయంలో కుటుంబాన్ని అడ్డు పెట్టాడని,హుజురాబాద్ లో ఉనికి కాపాడుకోవాలని దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు.ఇకపై హుజూరాబాద్ అభివృధ్ధి పట్ల దృష్టి సారిస్తామని,చిల్లర ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీలో లేదని,దిగజారుడు బ్లాక్ మెయిల్ చేయడంలో కౌశిక్ రెడ్డి చరిత్ర సృష్టించాడని అన్నారు.ఆధారాలు లేకుండా నేటి నుండి మంత్రి పై అరోపణలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలైనా హుజురాబాద్ కు ఒక మంచి పని కూడా చేయలేదని రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి ఒక జోకర్ అని అన్నారు.తాము ఆధారాలు ఉంటేనే మాట్లాడుతామని అన్నారు.