Sunday, December 22, 2024

చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం..

- Advertisement -

చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం..
డిప్యూటీ సర్వేయర్ సన్పెన్షన్
కుప్పం
కుప్పంలో సీఎం చంద్రబాబు కు చెందిన స్థలాన్ని కొలవడానికి లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ ను అధికారులు సస్పెండ్ చేసారు.  చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. ఆ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సెన్ రూ. 1.80 లక్షల లంచం ఇవ్వాలని కోరారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం మొత్తం అందించడంతోనే ఆ పనులు ముందుకు కదిలాయి.
గత నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు రాగా.. కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు. దాంతో ఈ లంచం బాగోతం వెలుగులోకి వచ్చింది. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషాతో శాఖాపరమైన విచారణ చేయించడంతో లంచం తీసుకున్న మాట నిజమే అని తెలిసింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ. లక్ష డిమాండ్ గత నెలలో శాంతిపురానికి చెందిన ఓ రైతు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి.. అది కూడా నిజమే అని అధికారులు తేల్చారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఏడీని ఆదేశించారు. దాంతో డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్