Do not post family photos on social media:
సోషల్ మీడియాలో ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయవద్దు
డిపి గా కూడా పెట్టుకోవద్దు డిపి గా పెట్టుకుంటే ఆ ఫోటోకు లాక్ చేయండి
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
సిద్దిపేట
ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యామిలీ ఫోటోలు పిల్లల ఫోటోలు సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, సైబర్ నేరగాళ్లు యాక్ చేసి రకరకాల వాడుకుంటున్నారు, జాగ్రత్త తల్లి కూతుళ్ళ అనుబంధం పై కొందరు యూట్యూబర్లు చేసిన అసభ్య కామెంట్స్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయము అందరికీ తెలిసిందే, మీ పిల్లల కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. ఫోటోలకు ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలి, కొన్ని కొన్ని సందర్భాలలో మీ స్నేహితులు మరియు సన్నిహితులు మనకు పడిరానివారు వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా బాధ్యతగా ఉండాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు.