Will accompany people..:
ప్రజలకు తోడుగా ఉంటా..
ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో అయినా తనను సంప్రదించవచ్చని వారి కష్టాల్లో తోడుగా ఉంటానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు వార్డుల నుంచి భారీగా వచ్చిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. వాటిని పరిష్కరిస్తాననిహమీ ఇవ్వడంతో పాటు త్వరలోనే గ్రామ గ్రామాన అధికారులతో సహా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఉదయం నుంచి సుమారు నాలుగు గంటల పాటు ఈ ప్రజా దర్బార్ తన ఇంటి ముందు ఉన్న చెట్ల కింద కూర్చుని ప్రజల సమస్యలు వింటూ వారికి హామీ లిస్తూ బొలిశెట్టి గడిపారు.



