ధర్మరాజ స్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం
శ్రీకాళహస్తి జూలై 11
Arrangements for the festival of Dharmaraja Swamy are ready
ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డులో వెలసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజస్వామి ఉత్సవాల ఏర్పాట్లను శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. వి. ఎస్. ఎన్ మూర్తి గురువారం పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 21వ తేదీ వరకు శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ఆవరణ లోని విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లు, అర్జునతపస్సు జరిగే ప్రదేశం, ఆలయంలోని ఈశాన్య భాగంలో తాటి చెట్టు పై అర్జునుడు సంప్రదాయబద్ధంగా తపస్సును ఆచరించి నిమ్మకాయలను భక్తులకు ప్రసాదంగా వెద జల్లడం ఆనవాయితీ. అదేవిధంగా అగ్నిగుండ ప్రదేశాన్ని కూడా పర్యవేక్షించారు ఈ ఉత్సవానికి భక్తులు వేలాది తరలివస్తారని అన్ని శాఖ అధికారులు సమన్వయంతో ఈ తిరునాళ్లను విజయవంతంగా చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు



