Sunday, February 22, 2026

తాడి క్వారీలో గ్రావెల్ మాఫియా నిజమే

- Advertisement -

తాడి క్వారీలో గ్రావెల్ మాఫియా నిజమే
– ఎం ఎస్ ఎం ఈ మాజీ డైరెక్టర్ నదియా
పరవాడ,

Gravel Mafia in Tadi Quarry is real

తాడి గ్రామంలోని క్వారీ సర్వే నంబర్ 116 లో  కూటమి నాయకుడు సూరిబాబు అనే వ్యక్తి ప్రభుత్వం లీజుకి అప్పగించిన క్వారీ పర్మిషన్ ని దుర్వినియోగం చేస్తూ అక్రమ తవ్వకాలను కొనసాగిస్తున్నాడు అని ఎం ఎస్ ఎం ఈ మాజీ డైరెక్టర్ నదియా ఆరోపించారు.ఇటీవలే మైన్స్ డిపార్ట్మెంట్ వారు వచ్చి క్వారీని పరిశీలించుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అవకాశం ఇచ్చిన లీజులో కాకుండా అధిక మెటీరియల్ తవ్వడం వలన సోకాస్ నోటిస్ ఇవ్వడం జరిగింది అని పేర్కొన్నారు.గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ 116 ని లో ఉన్న మెటీరియల్ ముందే తవ్వేసి ఇప్పుడు ఆ పర్మిషన్ పట్టుకొని మొత్తం కొండంత అక్రమ తవ్వకాలను చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని అన్నారు పైగా ఇది తప్పు అని గ్రామస్తులు ఎవరైనా అడిగితే మీకు దిక్కున చోట చెప్పుకోండి నా ఇష్టం కొండంత నాదే ఎవడో వస్తాడు రమ్మనండి అంటూ గ్రామస్తుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు .ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం లోకి మారి ఆ ఎమ్మెల్యేలు  పేరు చెప్పుకొని వారికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఒకవైపు సోకాస్ నోటీస్ కి ఇష్యూ చేసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా యధావిధిగా రోజుకి వందల కొద్ది ట్రిప్పుల్ని కొన్ని ప్రైవేటు కంపెనీలతో మెటీరియల్ తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారని వాపోయారు.స్థానిక మండల అధికారులు ఇలాంటివి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని ప్రజల్లో నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్