జంట హత్యల కేసులో నిందితుడు అరెస్టు

- Advertisement -

జంట హత్యల కేసులో నిందితుడు అరెస్టు
వరంగల్

Accused arrested in case of double murder

వరంగల్ జిల్లాలో జంట హత్యల కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్టు  డీసీపీ రవీందర్ తెలిపారు. చెన్నారావుపేట మండలం పదహారు చింతల్తండాలో జరిగిన దారుణ ఘటన వివరాలను నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి దక్కట్లేదనే హత్యలు చేశాడు. 9వ తరగతి నుంచి అమ్మాయి దీపిక , ఆటో డ్రైవర్ మేకల నాగరాజు అలియాస్ బన్నీతో పరిచయం ఉంది. అమ్మాయి మేజర్ అయ్యాక ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అతనితో ఉండలేనని దీపిక పుట్టింటికి వచ్చేసింది. దీపిక దక్కకపోవడానికి తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్, సుగుణ, కారణమని వారిపై కక్ష పెంచుకుని నాగరాజు హత్య చేశాడు. అందరినీ చంపేద్దామనే  తెల్లవారుజామున   వేట కొడవలి తీసుకొని యువతి ఇంటికి వెళ్లాడు. బయట నిద్రిస్తున్న శ్రీనివాస్, సుగుణలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల్లిదండ్రుల కేకలు విని బయటకు వచ్చిన దీపిక, మదన్లాల్లపై కూడా దాడి చేశాడు. దాడి తర్వాత అడ్డొచ్చిన వారిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడికి ఎవరూ సహకరించలేదు. హత్య జరిగిన తర్వాత పోలీసులు త్వరగా స్పందించారు. చట్టప్రకారం నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular